బెంగళూరులో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తన లవర్ కి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలన్న కోరికతో, ఓ యువకుడు నగ్నంగా మొబైల్ షాప్‌లోకి చొరబడిన సంఘటన పోలీసులను కూడా షాక్‌కు గురిచేసింది.
Naked Man Mobile Theft: ఈ సంఘటన మే 9వ తేదీ రాత్రి బెంగళూరు(Bengaluru)లోని హోంగసంద్ర ప్రాంతంలోని హనుమాన్ టెలికాం అనే మొబైల్ ఫోన్ షాప్‌లోకి ఒక యువకుడు నగ్నంగా దొంగతనానికి వచ్చాడు. షాప్ యజమాని దినేష్ ఊరిలో లేని సమయం చూసి దుండగుడు షాప్ లోకి చొరబడ్డాడు.
గోడలోకి రెండు అడుగుల రంధ్రం చేసి..
అసోంకు చెందిన 27 ఏళ్ల యువకుడు ఇమ్రానుల్లా, షాప్ గోడకు రెండు అడుగుల చేసి, ముఖానికి మాస్క్ వేసుకుని రంధ్రంలో నుంచి లోపలికి చొరబడ్డాడు. తన కొత్త బట్టలు పాడవకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నగ్నంగా వెళ్లినట్టు తెలిపాడు.
ఇమ్రానుల్లా షాప్‌లోకి ప్రవేశించి, లైట్లు ఆన్ చేయకుండా, తన మొబైల్ ఫోన్‌లోని టార్చ్ ఉపయోగించి ఖరీదైన ఫోన్లను మాత్రమే టార్గెట్ చేసాడు. రూ. 15,000 కంటే ఎక్కువ ధర గల ఫోన్లను మాత్రమే దొంగిలించి తక్కువ ధర ఫోన్లను వదిలేశాడు.
ఆయితే, తర్వాతి రోజు షాప్ యజమాని దినేష్ మే 10న మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈ సంఘటన గురించి తెలుసుకున్నాడు. సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యాలు చూసి వెంటనే తన స్నేహితుడుకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పోలీసులను తీసుకొని షాప్‌కి వచ్చి గోడకి ఉన్న రంధ్రం, మిస్సింగ్ ఫోన్లను గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజ్లో షాప్ బయట మరో వ్యక్తి నిలబడి ఉండటాన్ని గుర్తించారు. బయట ఉన్న వ్యక్తి పరిసరాలు గమనిస్తూ కాపలాగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తిని పోలీసులు ఇంకా పట్టుకోలేదు.
ఇమ్రానుల్లా పోలీసుల విచారణలో, ఫోన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మి, ఆ డబ్బుతో తన లవర్ కి గిఫ్ట్ కొనాలనే ఉద్దేశం తో ఈ పని చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు దొంగతనం జరిగిన ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కేసు నమోదు చేశారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





