కరీంనగర్ జిల్లాలో ఒక నిశ్చితార్థం చేసుకున్న యువకుడు, పెళ్లికి ముందురోజు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో రూ.40 లక్షల విలువైన భూమి, బంగారం, నగదును అందుకున్నాడు. పెళ్లి రద్దుతో వధువు కుటుంబం తీవ్రంగా ఆవేదన చెందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వధువు కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.
అందరూ పెళ్లి హడావిడి లో మునిగి ఉన్నారు. వధువు ముస్తాబైంది. వరుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతసేపైనా వరుడే కాదు వరుడి తరుపు బంధువులు కూడా రావడం లేదు. ఇంతలోనే గుండె పగిలే వార్త. వరుడు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతో ఒక్కసారి పెళ్లి పందిరి మూగపోయింది. అందరు షాక్ గురైయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మధుకర్ రెడ్డికి హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన ఓ అమ్మాయితో నిచ్చితార్థం జరిగింది. మే 17న వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. అమ్మాయి తరఫు వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
కానీ, ఇంతలోనే పెళ్లికి ఒక రోజు ముందు మధుకర్ రెడ్డి మరో అమ్మాయిని ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసుకొన్నాడు. రూ.40 లక్షల విలువైన అర ఎకరం భూమి,10 తులాల బంగారం, 6 లక్షల నగదుతో పెళ్లికి ఒప్పుకున్న వరుడు ఇలా పెళ్లి రోజు ఊహించని షాక్ ఇవ్వడంతో వధువు తల్లిదండ్రుల గుండె పగిలినంద పనైంది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా అబ్బయి తండ్రి ఏం చేసుకుంటారో చేసుకోమని అంటున్నాడని వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుడి కోసం గాలిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో