పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రోజురోజుకూ బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువవుతున్నాయి. భారత్ ఆపరేషన్ సిందూర్ తో బుద్ధి చెప్పినా.. పాక్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు.. ఇండియన్ ఆర్మీ చేస్తున్న మెరుపుదాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్.. సరిహద్దుల్లో మళ్లీ దాడులకు తెగబడుతోంది. భారత దళాలు కూడా అదేస్థాయిలో తిప్పికొడుతున్నాయి.. ఈ క్రమంలో భారత్-పాక్ యుద్ధంపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు.
కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించాం.. తక్షణ సీజ్‌ఫైర్‌కు భారత్, పాక్ అంగీకరించాయి.. ఇరు దేశాలకు అభినందనలు.. అంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ లో తెలిపారు.
భారత్ పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు… “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం 17..00 గంటల నుండి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనను అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న 12:00 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు.” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!