SGSTV NEWS
National

Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో విద్యార్థుల ఆందోళన



మరోవైపు, భారత్-పాక్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లో హై అలర్ట్, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ అయింది.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దుల్లో బాంబుల మోత కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఎన్‌ఐటీలో మొత్తం 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. శ్రీనగర్‌ను వీడి తమ స్వస్థలాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. దీంతో అధికారులు జమ్ముకశ్మీర్ లోని తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


మరోవైపు, భారత్-పాక్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లో హై అలర్ట్, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ అయింది. యూపీ డీజీపీ పోలీసులకు రక్షణ శాఖతో సమన్వయంతో భద్రత కల్పించాలని ఆదేశించారు.

Also read

Related posts