పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్‌పై 300-400 టర్కిష్ డ్రోన్లతో దాడి చేసింది. భారత రక్షణ వ్యవస్థ వందలాది డ్రోన్లను అడ్డుకుంది. ఈ దాడిలో 16 మంది భారతీయులు మరణించారు. భారత సైన్యం ప్రతీకార చర్యలు తీసుకుంది, పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించింది.
భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రతీకారమంటూ యుద్ధానికి కాలు దువ్విన పాకిస్థాన్ గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే పేల్చినట్లు సమాచారం వచ్చింది. అయితే ఓ 50 డ్రోన్లతో పాక్ దాడి చేసినట్లు ప్రాథమికంగా తెలిసినా.. అసలు విషయం తాజాగా కల్నల్ సోఫియా బయటపెట్టారు. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లోని 36 పట్టణ జనాభా కేంద్రాలలో లేదా సమీపంలో భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ 300 నుండి 400 టర్కిష్ డ్రోన్‌లను అర్ధరాత్రి దాడులకు ప్రయోగించిందని కల్నల్ సోఫియా ఖురేషి శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు.
వందలాది డ్రోన్లను భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఇది ఇప్పటికే ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అని కల్నల్ ఖురేషి అన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కొనసాగుతున్న కాల్పులు, ఫిరంగి దాడులలో ఒక సైనికుడు సహా 16 మంది భారతీయులు మరణించారని కల్నల్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం తన పాక్‌కు భారీ నష్టం కలిగించిందని, వందలాది డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసిందని, లాహోర్‌లో చైనా తయారు చేసిన HQ-9 వ్యవస్థతో సహా పాకిస్తాన్ వైమానిక రక్షణ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేసినట్లు కల్నల్ ఖురేషి మీడియాకు వెల్లడించారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!