లేడీ అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. త్వరలో ఆమెను ఓ బిగ్ పొలిటీషియన్ ములాఖత్‌లో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక లాయర్‌తో మాట్లాడి అఘోరీకి బెయిల్ తెచ్చే పనిలో ఉన్నాడని సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ సంచలనంగా మారింది. గత ఏడాది నుంచి అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది. సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ తల్లి ఆలయం ధ్వంసం అయినప్పటి నుంచి లేడీ అఘోరీ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు వర్షిణీ అనే యువతిని పెళ్లి చేసుకుని మరింత పాపులర్ అయ్యాడు.
చివరికి జైలు పాలయ్యాడు. వర్షిణికి ముందు తానే అఘోరీ మొదట భార్యను అంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడంతో ఈ ఎపిసోడ్ సినిమాను తలపించింది. అనంతరం అఘోరీపై ట్రాన్స్ జెండర్స్ యూనియన్లు సైతం పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. దీంతో వర్షిణిని పెళ్లి చేసుకుని పారిపోయిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని అరెస్టు చేశారు.
14 రోజుల రిమాండ్
ప్రస్తుతం అఘోరీ చంచల్ గూడ జైల్లో 14 రోజుల రిమాండ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అఘోరీకి సంబంధించి ఓ బిగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. త్వరలోనే అఘోరీకి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అఘోరీ వెనుక చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారని ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ చాలా మంది బడా పొలిటీషియన్స్‌లో ఒకరు బయటకొచ్చినట్లు సమాచారం.
అఘోరీతో ములాఖత్
ఆ పొలిటీషియన్ ఇప్పుడు అఘోరీని కలవడానికి ఏకంగా చంచల్ గూడ జైలుకు వెళ్ళబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన అఘోరీతో ములాఖత్ కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఒక లాయర్‌తో మాట్లాడి అఘోరీకి బెయిల్ తెచ్చే పనిలో ఆ బడా పొలిటీషియన్ ఉన్నాడని సమాచారం.
ఇవన్నీ ఇప్పుడిప్పుడే బయటకు రావడంతో ఆ పొలిటీషియన్ ఎవరా? అని చాలా మంది తెగ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బెయిల్ పై అఘోరీ బయటకు వచ్చాక.. ఎలా ప్రవర్తిస్తుంది?.. గతంలో మాదిరిగానే ఉంటుందా? లేక ప్రవర్తనలో మార్పులు చేసుకుంటుందా? అని కొందరు చర్చించుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Also read
- Garuda Puranam: మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా..?
- Goddess Pydithallamma: విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
- స్త్రీలు తలస్నానం చేసేందుకు నియమాలున్నాయని తెలుసా.. ఏరోజున చేయడం శుభప్రదం అంటే..
- May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్.. 12 రాశులకు మే మాసఫలాలు
- Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?