సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్‌వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. అయితే ఈ మృతుల్లో సాఫ్ట్‌వేర్ దంపతులు ఉన్నారు. విశాఖలో మధురవాడకి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. పిళ్లా ఉమామహేశ్వరరావు హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం చేస్తుండగా.. శైలజ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తోంది
వర్క్ ఫ్రమ్ హోం..
ప్రస్తుతం వీరికి వర్క్ ఫ్రమ్ హోం కావడంతో వైజాగ్‌లో ఉంటున్నారు. చందనోత్సవం సందర్భంగా వేకువ జామున 2 గంటలకు దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉండగా.. గోడ కూలిపోయింది. ఇటీవల ఆ గోడను కట్టగా.. చిన్న పాటి వర్షానికి కూలి వీరిపై పడింది. దంపతులు ఇద్దరూ కూడా మృతి చెందడంతో సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు
ఇదిలా ఉండగా.. చందనోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు లైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్‌లో సిమెంట్ గోడ కూలింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025