ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్ చేశాడు. దానిని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు ఇంట్లోని వారందరు ఆ కూరను భోజనంతో పాటు తిన్నారు. తినగా ఇంకాస్త కూర మిగిలింది. దానిని భద్ర పరిచేందుకు పార్శిల్ ఓపెన్ చేసి చూడగా లోపల కనిపించిన..
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 27: ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్ చేశాడు. దానిని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు ఇంట్లోని వారందరు ఆ కూరను భోజనంతో పాటు తిన్నారు. తినగా ఇంకాస్త కూర మిగిలింది. దానిని భద్ర పరిచేందుకు పార్శిల్ ఓపెన్ చేసి చూడగా లోపల కనిపించిన సీన్ చూసి దాదాపు వాంతి చేసుకున్నంత పనైంది. ఈ షాకింగ్ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం..
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ హోటల్‌కి హరీశ్ అనే వ్యక్తి ఏప్రిల్ 25 సాయంత్రం (శుక్రవారం) 4 గంటల సమయంలో వెళ్లాడు. ఆ హోటల్లో బోటీ కూర పార్సిల్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అందరూ భోజనంలో బోటీ కూర తిన్నారు. అందరూ తినగా మిగిలిన అదే పార్సిల్‌ను ఓపెన్ చేసి అడుగున ఉన్న కూరను ఓ పాత్రలో వేయగా.. బాగా మాసాలా దట్టించి కూరలో కలిసి పోయిన ఎలుక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన హరీశ్ కుటుంబ సభ్యలను తీసుకుని ఆస్పత్రికి పరుగు తీశాడు.
అనంతరం అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో వెళ్లి హోటల్ నిర్వాహకుడిని నిలదీశాడు. దీంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌కు వెళ్లి వాకబు చేశారు. హరీశ్ ఫిర్యాదు మేరకు జిల్లా ఆహార తనిఖీ అధికారి మనోజ్‌కుమార్ హోటల్‌పై దాడి చేశారు. బిర్యానీ, వంటగది పరిసరాలను పరిశీలించి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. బోటీ కూరలో ఎలుక ప్రత్యక్షమైన ఘటనకు సంబంధించిన ఫొటోల ఆధారంగా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం హోటల్ యాజమన్యానికి సమన్లు జారీ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగడంతో ఒక్కసారిగా నగరమంతా ఉలిక్కిపడింది.
Also read
- మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
- ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది.. మృతదేహంతో స్మశానంలో జాగారం..!
- Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం
- Andhra: చవితి వేళ పాలు పోసేందుకు పుట్ట వద్దకు భక్తులు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?




