పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం అడగడంతో పాటు మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్‌కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు.
ఇద్దరు తెలుగు వాసులు
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ అనే తెలుగు వ్యక్తి కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్ బెంగూళురులో స్థిరపడినట్లు తెలుస్తుంది.కుటుంబంతో కలిసి ఆయన కశ్మీర్‌యాత్రకు వెళ్లారు.ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్ రంజన్ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు
Also read
- వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి…
- 27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
- Pitru Dosham: ఇంట్లో అకస్మాత్తుగా సమస్యలా?.. అది మీ పూర్వీకుల శాపం కావచ్చు, వెంటనే ఈ ఆలయాలను దర్శించండి!
- Mystic Truths: గుడి బయట చెప్పులు మాయమయ్యాయా?.. మీకు లక్ష్మీ దేవి ఇచ్చే సంకేతం ఇదే!
- మద్యం మత్తులో హోం గార్డుపై దాడి!





