పరిహారం అడగడమే పాపమా?
పవన్ ఇలాకా పిఠాపురం మల్లంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పనిచేస్తూ కరెంట్ షాక్‌తో పల్లపు సురేష్ చనిపోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన దళితులను అగ్రవర్ణ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. టిఫిన్, కిరాణ షాపు సరుకులు కూడా ఇవ్వట్లేదు
Pawa Kalyan: ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అగ్ర వర్ణాలు దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం కలకలం రేపుతోంది. వస్తువులను విక్రయించరాదంటూ హుకుం జారీ చేయడంతో దుకాణదారులు అమ్మకాలు నిలిపివేశారు. ఓ ఇంటి దగ్గర విద్యుత్ పని చేస్తూ షాక్ తగిలి పల్లపు సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. దీంతో గ్రామం నుంచి బహిష్కరించారని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈనెల 16న అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి కరెంటు పనిచేస్తూ షాక్ తో పల్లపు సురేష్ చనిపోయాడు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. నష్టపరిహారంగా సుమారు రూ. 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు వాదనకు దిగారు. దీంతో దళితులను దూరం పెట్టాలని నిర్ణయించగా.. వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఆదేశాలు పాటించని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూ మరింత ముదరడంతో పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. స్వయంగా ఆర్డీవో రంగంలోకి దిగి దళితులు, అగ్రవర్ణాల వాదనలు విన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- హర హర మహాదేవ్.. చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం.. ఏపీలో ఎక్కడ ఉందంటే..
- ఫిట్స్ వచ్చిన బైకర్‌కు సాయం చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే..
- ఎంతకు తెగించార్రా.. తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు.. కారణం తెలిస్తే..
- ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..





