ఏపీలో మట్కా సింగిల్ నంబర్ మూడు ముక్కలాట, ఆన్ లైన్ గేమ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెక్కీ నిర్వహించిన పోలీసులు జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పాటు జూదానికి వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Ap Crime : ఏపీలో మట్కా సింగిల్ నంబర్ మూడు ముక్కలాట, ఆన్ లైన్ గేమ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెక్కీ నిర్వహిస్తోన్న పోలీసులు వరుసగా జూదగాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ ఏవీ రమణ మీడియా సమావేశం నిర్వహించి జూదం నిర్వహకులను అరెస్ట్ చేసిన విషయాన్ని వివరించారు.
Also read: Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మట్కా, సింగిల్ నంబర్, మూడు ముక్కలాట , ఆన్లైన్ గేమ్స్ నిర్వహిస్తోన్న వారిపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు.సింగిల్ నెంబర్ జూదం ఆడిస్తున్న 8మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వెంకటగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ ఏవి రమణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగిల్ నెంబర్ జూదం నిర్వహలు 16 మందిని అదుపులో తీసుకున్నట్లు వివరించారు. ఎస్సై సుబ్బారావు ఆధ్వర్యంలో పలు జూదం సెంటర్లపూ గత కొంతకాలంగా రెక్కీ నిర్వహించి పూర్తి ఆధారాలతో పట్టుకోవడం జరిగిందని అన్నారు.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఎస్పీ గీతా కుమారి ఆదేశాలతో వేగవంతంగా విచారణ చేపట్టిన పోలీసులు ముఠా నిర్వాహకులు పై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ తరలించినట్లు వివరించారు.వెంకటగిరిలో పేకాట, జూదం, మూడుముక్కలాట, డ్రగ్స్, సింగిల్ నెంబర్ ఆటతో యువకులు, ఆటో కార్మికులు, కూలీల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. బాధితులు సమాచారంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ నెంబర్ ఆటపై మా పోలీస్ సిబ్బంది దృష్టి సారించారన్నారు. ముందు ముందు ఇలాంటి గేమ్స్ ఆడిస్తే వారితో పాటు ఆడినవారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. జూదం ముఠా నిర్వాహకుల నుండి సుమారు రూ 26,500 నగదు 56 నంబర్ టోకెన్స్ స్లిప్స్ స్వాధీనం చేసుకున్నామని సీఐ ఏవి రమణ తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025
Kolkata: కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. అలా ఎలా చేస్తారంటూ..