లేడీ అఘోరీ, శ్రీవర్షిణి పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు నిన్నటి నుంచి స్విచ్చాఫ్ వస్తున్నాయి. అఘోరీపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో వారిని అరెస్టు చేస్తారనే భయంతో పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది
అఘోరీ-శ్రీ వర్షిణి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మరింత సంచలనంగా మారారు. వర్షిణీ మెడలో మూడోసారి తాళికట్టిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అఘోరీ, శ్రీవర్షిణిలపై కొందరు ట్రాన్స్జెండర్లు విరుచుకుపడుతున్నారు. వాడు అఘోరీ కాదని.. వాడొక మోసగాడని అంటున్నారు
అంతేకాకుండా అఘోరీ తన మొదటి భర్త అని రాధ అనే మహిళ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అఘోరీ, వర్షిణిల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వారిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ట్రాన్స్జెండర్లు సైతం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందించారు.
పరారీలో అఘోరీ
ఈ విషయం తెలుసుకున్న శ్రీవర్షిణి, అఘోరీ పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. నిన్నటి (బుధవారం) నుంచి కూడా వారిద్దరి ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారిపై కేసులు నమోదు అయిన నేపథ్యంలో అరెస్టు చేస్తారనే భయంతో అఘోరీ, శ్రీవర్షిణి పరారైనట్లు తెలుస్తోంది. ఇక అఘోరీపై శామీర్ పేట్లో కేసు పెట్టిన జోగిని సంధ్య సంచలన విషయాలు తెలిపారు.
ఈ మేరకు సంధ్య మాట్లాడుతూ.. ‘‘అఘోరీగాడు ఒక ట్రాన్స్ జెండర్.. వాడు ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. వాడిని వెంటనే అరెస్టు చేయాలి. అఘోరిని పట్టుకుని లోపలెయ్యాయి. వాడు మా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలలో పరువు తీసేశాడు. వాడు ఒకవైపు అఘోరీల పరువు, మరోవైపు ట్రాన్స్ జెండర్ల పరువు తీసేశాడు. మేము బయట తిరగాలంటే తలెత్తుకోలేకపోతున్నాం. సనాతన ధర్మం.. లోకకళ్యాణమంటూ వచ్చినోడు.. ఇప్పుడు వాడి కళ్యాణం చేసుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలి.’’ అంటూ డిమాండ్ చేసింది
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





