ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్ పెట్టినట్లు తెలిపింది.
ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తు్ంది. మధురపురి కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో ప్రేమలో ఉంది. అయితే మల్లీశ్వరి కులం వేరే కావడంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు
మల్లీశ్వరి కులం వేరే కావడంతో
దీనికి తోడు ఇటీవల జానారెడ్డికి మరో యువతితో పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్లీశ్వరి తాను ఉంటున్న హాస్టల్ లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్ పెట్టినట్లు తెలిపింది. మల్లీశ్వరి స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి ఆమె మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు జానారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





