April 16, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …


సికింద్రాబాద్ ఖార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగులమందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా వారు విగతజీవులుగా పడి ఉన్నారు.

Sisters commit suicide : సికింద్రాబాద్ పరిధిలోని ఖార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగుల మందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తెరిచి చూడగా.. అక్కాచెల్లెలు విగతజీవులుగా పడి ఉన్నారు.

మృతులను వీణ, మీనాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మానసిక స్థితి బాగలేకపోవడమే ఆత్మహత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. వీనా, మీనాల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Also read

Related posts

Share via