పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ సానుభూతిపరులపై దాడి – కన్యాకుమారి కుటుంబంపై దాడి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ సానుభూతిపరులైన కన్యాకుమారి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వారిపై రాళ్లు, వేటకొడవలితో నారాయణస్వామి దాడి చేశారు. ఈ ఘటనలో కన్యాకుమారి, హరినాథ్, వెంకటేశ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గత నెలలో కన్యాకుమారి బంధువు, తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ హత్యకు గురయ్యారు.
మార్చి 15న కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. రామకృష్ణతో పాటు ఆయన కుమారుడు సురేష్‌పై అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత వెంకటరమణ కొడవలితో దాడి చేశాడు. ఘటనలో గాయపడిన తండ్రి, కుమారుడిని ముందుగా మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు.
తమ కుటుంబాల మధ్య పాతకక్షలు ఏమీ లేవని మృతుని కుమారుడు సురేష్ పేర్కొన్నారు. తాము కేవలం తెలుగుదేశం పార్టీతో ఉన్నామనే కారణంతోనే హత్యకు పాల్పడ్డారని చెప్పారు. అయితే వెంకటరమణతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలు పలుమార్లు తన కుటుంబంపై దాడికి పాల్పడ్డారని తనకు ప్రాణహాని ఉందని మృతుడు రామకృష్ణ గతంలోనూ ప్రస్తావించారు. స్థానిక సీఐ వైఎస్సార్సీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని గతంలో మాట్లాడిన వీడియోలో వెల్లడించారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!