పీకల దాకా మద్యం తాగాడు. ఆ మత్తులో ఇంట్లో వాళ్లతో గొడవ పడ్డాడు. బయటకు వచ్చి న్యూసెన్స్ చేశాడు. అతని గోల తట్టుకోలేక స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే ఆ వ్యక్తి మరో పిచ్చి పని చేశాడు.
తాగిన మైకంలో కొంతమంది ఏమి చేస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోతారు.. ఇలాగే ఓ వ్యక్తి చేసిన పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది. మద్యం మత్తులో అర్థరాత్రి ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. అతని గోలను తట్టుకోలేని స్థానికులు, కుటుంబీకులు 100 డయల్‌కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చారు. పోలీసులను చూసిన ఆ వ్యక్తి భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఉరి వేసుకున్నాడు.. తక్షణమే తేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి.. అతడిని కిందకు దించి CPR చేసి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించి అతని ప్రాణాలను కాపాడారు.
వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా శివంపేట మండలం దేవయ్యగూడెం తండాలో రాత్రి 12:00 ప్రాంతంలో లున్సవత్ రాజు అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి, గొడవ చేస్తూ కుటుంబీకులను, స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసాడు. ఇతని గొడవ వల్ల ఇబ్బంది పడిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా.. బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్లారు. వారిని చూసిన రాజు భయపడి వెంటనే రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. బ్లూ కోల్ట్స్ కానిస్టేబుళ్లు మహేందర్, విష్ణు వర్ధన్ రెడ్డి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే రాజు ఉరివేసుకొని ఉన్నాడు… అతనిని కిందకు దించి కానిస్టేబుల్ విష్ణువర్ధన్ రెడ్డి CPR చేసి, హుటాహుటిన తండాకు చెందిన ఇతరులతో కారులో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం బ్రతికాడు. అనంతరం మెరుగైన చికిత్స నిమీత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం రాజు చికిత్స పొందుతున్నాడు. పోలీస్ కానిస్టేబుళ్లు సమయానికి వచ్చే CPR చేయడం వల్లే తమ భర్త బతికాడంటూ తన నిండు మాంగల్యాన్ని నిలబెట్టిన పోలీస్ దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేసింది రాజు భార్య.
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





