SGSTV NEWS
Andhra Pradesh

సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము

*కృష్ణా జిల్లా*  :గన్నవరం/గుడివాడ
*ఇటీవల కురిసిన  అకాల వర్షాల కారణంగా బుడమేరు కాలువ నీట ముంపునకు గురవ్వడం తెలిసిందే…** *ఈ తుప్ఫాను ప్రభావంతో నందివాడ మండలం చేదుర్తిపాడు గ్రామంలో సర్కార్ గట్టుకు గండి పడటంతో గ్రామం నీట మునిగి ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా గట్టుకు గండి పడటంతో బాపులపాడు మండలం వరకు ఉన్న పంట పొలాలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.* ..*ఈ విషయాన్ని గ్రామ పంచాయితీ సర్పంచ్ బొల్లం వేణుగోపాలరావు, గ్రామ పార్టీ నాయకులు తాతనబోయిన ఉమామహేశ్వరరావు, గ్రామస్తులు కలిసిగుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము,నాయకులు యార్లగడ్డ రవి దృష్టికి తీసుకెళ్లారు* .*దీంతో వారు స్పందించి సుమారు 100 మీటర్లు వరకు సర్కార్ గట్టుకు  కాంట్రాక్టర్ గొట్టిపాటి శ్రీధర్ సమక్షంలో మర్రమతులు చేపట్టారు… ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడ్డామని,అడిగిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.*.

Also read.

Related posts

Share this