వార ఫలాలు (ఏప్రిల్ 6-12, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. తృతీయ స్థానంలో కుజుడు, ధన స్థానంలో గురువు కారణంగా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. ఉద్యోగంలో అధికారుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఢోకా లేదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో బాగా దూసుకుపోతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తరచూ సుందరకాండ పారాయణ చేయడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి ఉచ్ఛ పట్టడంతో పాటు, లాభ స్థానంలో గ్రహాల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం అవసరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో సహా అయిదు గ్రహాల యుతి వల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా, ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది. వ్యక్తి గత సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ రాశివారు దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టినందువల్ల ఆస్తి వివాదం పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, సొంత ఇంటి ప్రయత్నాలు చాలావరకు నెరవేరడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల సహకారంతో పదోన్నతి లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందడం జరుగుతుంది. ఈ రాశివారు శివార్చన చేయించడం అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఈ రాశికి అష్టమ స్థానంలో గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం, నమ్మక ద్రోహం, మోసం వంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి కానీ, ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, శ్రమ ఎక్కువగా ఉండడంతో పాటు వృథా ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశివారు ఆదిత్య హృదయం పఠించాల్పిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం, భాగ్య స్థానంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఏ పని తలపెట్టినా విజయవంతంగా ముగుస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లా సంగా ముందుకు సాగుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఎక్కువగా గణపతి స్తోత్రం పఠించడం అవసరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు శుభ గ్రహమైన గురువుతో పరివర్తన చెందినందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఈ రాశివారు విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం ఉత్తమం.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆదాయ మార్గాలు ఆశించిన స్థాయిలో లాభాలు కలిగిస్తాయి. శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ రాశివారు స్కంద స్తోత్రం పఠించడం అవసరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ, ఉచ్ఛ శుక్రుడితో పరివర్తన చెందినందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆరవ స్థానంలో ఉన్న గురువు వల్ల ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సాఫీగా సాగిపోతాయి. వీరు తరచూ స్కంద స్తోత్రం పఠించడం చాలా మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
తృతీయ స్థానంలో అయిదు గ్రహాలు చేరడం వల్ల ఈ రాశివారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు, కొత్త ప్రాజెక్టుల కారణంగా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగు తాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడం చాలా ఉత్తమం.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశికి ధన స్థానంలో గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలను విస్తరించడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవ హారాలు సాదా సీదాగా సాగిపోతాయి. శనీశ్వరుడి ముందు తరచూ దీపం వెలిగించడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశిలో అయిదు గ్రహాల యుతి వల్ల ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాల్లో కొద్దిగా గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కొద్దిగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. సన్నిహిత బంధుమిత్రులను సైతం గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరి వల్ల ఆర్థికంగా నష్ట పోయే సూచనలున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్య మైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
Also read
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?