సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బోయిన్‌పల్లిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఆరుగురు సభ్యుల కుటుంబం అదృశ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రాత్రి ఆ కుటుంబ బంధువు ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన వారిలో దాండ్ల ఉమ, ఆమె భర్త మహేష్, ఆరు, నాలుగు సంవత్సరాలు, తొమ్మిది నెలల వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు, ఉమ చెల్లెలు సంధ్య ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఆ కుటుంబం ఇంటి నుంచి సామానుతో బయలుదేరి, తాము ఖాళీ చేస్తున్నట్లు ఇంటి యజమానికి తెలియజేసింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఆ కుటుంబం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వైపు వెళుతున్నట్లు కనిపిస్తోంది. వారి కదలికలను మరింత తెలుసుకోవడానికి ప్రస్తుతం ఎంజీబీఎస్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం అని బోయిన్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.
దినసరి కూలీ అయిన మహేష్ తన భార్య, పిల్లలతో న్యూ బోయిన్‌పల్లిలో నివసిస్తున్నాడు. ఏప్రిల్ 2న, సంధ్య వారిని చూడటానికి మేడ్చల్ నుంచి వచ్చింది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3న ఉదయం ఇంటి యజమాని… ఉమా సోదరుడికి కుటుంబం మొత్తం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు తొలుత తెలిసిన ప్రాంతాల్లో వెతికి, మిత్రులను వాకబు చేసి.. తెలిసిన వారితో మాట్లాడినా ఆచూకి లభించకపోవడంతో, పోలీసులను సంప్రదించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. కుటుంబం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్ బోయిన్పల్లిలో వాటర్ సప్లై యూనిట్‌లో ఆపరేటర్గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
- ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది.. మృతదేహంతో స్మశానంలో జాగారం..!
- Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం
- Andhra: చవితి వేళ పాలు పోసేందుకు పుట్ట వద్దకు భక్తులు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?




