ప్రస్తుత కాలంలో పాముల సంచారం ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ పాములు తిష్ట వేసుకొని జనాలను భయపెడుతున్నాయి. చాలామంది పాముకాట్లకు గురై చనిపోతున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా పాముకాటుతో ఓ యువతి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. బట్టలు ఉతుకుతున్న యువతిని పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.
కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో శ్రుతి ప్రియ అనే యువతి ఇంటివద్ద బట్టలు ఉతుకుతుండగా ఆమెను ఏదో కుట్టినట్టు అనిపించి ఏమై ఉంటుందా అని చూసే సరికి అక్కడ పాము కనిపించడంతో ఆమె షాకయింది. భయంతో కేకలు వేసింది. వెంటనే పరుగెత్తుకొచ్చిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు ప్రియను రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చికిత్సకోసం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియ మృతిచెందింది.
బీఎస్సీ పూర్తి చేసిన శ్రుతి ప్రియ ఇంటివద్దే ఉంటోంది. వచ్చే ఏడాది ప్రియకు వివాహం చెయ్యాలని భావించిన ఆమె తల్లి మంగాదేవి గల్ఫ్ దేశానికి పని కోసం వెళ్లింది. తల్లి దగ్గరలేని సమయంలో శ్రుతి ఇలా మరణించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఇటీవల ఈ ప్రాంతంలో రక్తపింజర పాములు ఎక్కువైపోయాయని, ఇవి మట్టి రంగులోనే ఉండటంతో గుర్తుపట్టలేక ఇలా పాముకాట్లకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. ఆదుర్రు గ్రామానికి సమీపంలోనే PCH ఉందని, అక్కడ యాంటీ వీరం ఇంజెక్షన్ ఉన్నా.. సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే శ్రుతి మరణించిందని వాపోయారు. ప్రతీ గ్రామానికి దగ్గర్లో ఉన్న PHC ఆసుపత్రిలో సిబ్బంది, ఇంజెక్షన్ అందుబాటులో ఉంచి ప్రజలు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





