ప్రస్తుత కాలంలో వివాహాలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధం కాని పరిస్థితి. ఒకరితో ప్రేమాయణం.. మరొకరితో వివాహం.. పాత పరిచయాలతో కట్టుకున్నవారిని కడతేర్చడం సాధారణమైపోయింది. వివాహ బంధం నమ్మకం, విశ్వాసంమీదా ఆధారపడి ఉంటుంది. రాను రాను వీటికి విలువ లేకుండా పోతోంది. ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. రిలేషన్ ఇంకొకరితో ఇలా మానవ సంబంధాలు భ్రష్టుపట్టిపోతున్నాయనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ప్రబుద్ధుడి గుట్టు రట్టుచేసింది కాన్ఫ్‌రెన్స్ కాల్.
సెల్‌ఫోన్ కాన్ఫరెన్సు కాల్ ఓ మోసగాడి బారి నుంచి ఓ యువతి జీవితాన్ని కాపాడింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడికి మరో మండలానికి చెందిన యువతితో నెల రోజుల కిందట పెళ్లి నిశ్చయమైంది. వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో ఓ రోజు కాబోయే భర్తతో మాట్లాడేందుకు సదరు యువతి అతడికి ఫోన్ చేసింది. అప్పటికే అతడు మరో యువతితో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ కాల్‌ను హోల్డ్‌లో పెట్టి ఈ కాల్ లిఫ్ట్ చేసి బైక్‌పై ఉన్నానని, మళ్లీ కాల్ చేస్తానంటూ పెళ్లి చేసుకోబోయే యువతికి చెప్పాడు. అనంతరం ఈ కాల్‌ను కట్ చేయబోయి అనుకోకుండా మెర్జ్ చేయడంతో కాన్ఫరెన్సు కాల్‌లో మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్న యువకుడి గుట్టు పెళ్లి చేసుకోబోయే యువతికి అర్ధమైంది.
వారిద్దరి మధ్య సాగిన సంభాషణను రికార్డు చేసిన వధువు ఆ ఫోన్ సంభాషణను పెద్దల ముందు ఉంచింది. దీంతో మరికొద్ది రోజుల్లో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుని, కట్నం డబ్బులను తిరిగి తీసుకున్నారు. ఓ కాన్ఫరెన్సు కాల్ ఇలా ఓ యువతి జీవితాన్ని కాపాడటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
Also read
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..
- ఏకదంత సంకష్టి చతుర్థి: మే 5నా లేదా 6నా? చంద్రోదయ సమయం, పూర్తి పూజా విధానం..
- ఒకరాత్రి నగ్నపూజకు రూ.30 లక్షలు





