SGSTV NEWS
Andhra PradeshCrime

Crimenews..రాజమహేంద్రవరంలో  కుమార్తె దారుణ హత్య.. ప్రేమికుడే హంతకుడా?


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని హుకుంపేట వాంబే కాలనీలో తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు.

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని హుకుంపేట వాంబే కాలనీలో తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఏలూరుకు చెందిన ఎండీ సల్మా (38), సానియా(16)ను కత్తితో పొడిచి హత్య చేశారు. తల్లి, కుమార్తెను హత్య చేసిన అనంతరం నిందితుడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ మధ్యాహ్నం 3గంటలకు బంధువుల్లో ఒకరు వచ్చి ఇంటి తలుపు తట్టగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కిటికీలోంచి లోపలికి చూడగా మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న ఎస్పీ నరసింహ కిశోర్, ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ విద్య, బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ అక్కడికి చేరుకొని క్లూస్ టీమ్తో వేలిముద్రలు సేకరించారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సానియాను ప్రేమించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Also read

Related posts

Share this