ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కి సంబంధించి బ్లాక్ టిక్కెట్ల అక్రమ దందాపై పోలీసులు దాడులు చేశారు. ఎస్ఓటీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 15 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టిక్కెట్ల దందా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు(ఆదివారం, మార్చి 23) ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ టిక్కెట్ల దందా షురూ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించినట్లు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు తెలిపారు
Also Read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





