కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు స్థానిక దర్గా సెంటర్లో బంగారు ఆభరణాలు తయారీ షాపు యజమాని కామేశ్వరరావు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు
కొంతకాలంగా చిన్నారులపై కామేశ్వరరావు అత్యాచారం చేస్తున్నట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన చిన్నారులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో పిల్లలను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు వారి ప్రైవేట్ పార్ట్స్లో తీవ్రగాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు.
దీంతో పిల్లలను విచారించగా కామేశ్వరరావు చేసిన అఘాయిత్యం వెలుగులోకివచ్చింది.దీంతో ఆగ్రహానికి గురైన చిన్నారుల బంధవులు స్థానికులు కామేశ్వరరావుపై చెప్పులు ,చీపుర్లతో దాడి చేశారు. దీంతో కామేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025