వార ఫలాలు (మార్చి 16-22, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు కూడా సజావుగా సాగిపోతాయి. మిథున రాశి వారికి నాలుగు శుభ గ్రహాలతో దశమ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, శనులతో పాటు రాశ్యధిపతి కుజుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లా సంగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విహార యాత్రలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. విలాస జీవితం అనుభవిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఉపయోగం ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, మరో మూడు గ్రహాలతో కలిసి ఉండడం వల్ల ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు కూడా సజావుగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కొద్దిగా నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
నాలుగు శుభ గ్రహాలతో దశమ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆదాయపరంగా కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో సహా నాలుగు గ్రహాలు యుతి చెందడం, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుందన్నట్టుగా వారం రోజుల పాటు జీవితం సాగిపోతుంది. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఒక వెలుగు వెలుగుతారు. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు ఝ అందుతాయి. తోబుట్టువులతో కొన్ని వివాదాలు, అపార్థాలు తొలగిపోయి, సఖ్యత ఏర్పడుతుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు మిత్రుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆశించిన శుభ వార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమాధిపతి శుక్రుడు ఉచ్ఛలో ఉండడం, దశమ స్థానంలో గురువు, లాభ స్థానంలో కుజుడు సంచారం వల్ల ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో బాగా లాభాలు పొందుతారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సప్తమ స్థానంలో నాలుగు గ్రహాలు యుతి చెందడం, భాగ్య స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాల్లో లాభాలు ప్రోత్సాహక రంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, ఇతర లావాదేవీల వల్ల, మదుపుల వల్ల బాగా లాభాలు పొందుతారు. ఆస్తి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభ వార్త వింటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
నాలుగు గ్రహాలతో ఆరవ స్థానం బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ధనాదాయం ఆశాజనకంగా కొనసాగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధువులు బాగా ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెడతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
పంచమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో సహా నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ, సమర్థత మరింతగా రాణిస్తాయి. మంచి గుర్తింపుతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా పురోగమిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు ఉచ్ఛ శుక్రుడితో పరివర్తన చెందడం, తృతీయ స్థానంలో శని సంచారం చేస్తుండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విలాస జీవితం గడిపే సూచనలున్నాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి, లాభం పొందుతారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. పరిచయ స్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు కానీ, వృత్తి, ఉద్యోగాల్లో మాత్రం పని భారం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. అధికారులు ఎక్కువగా ఆధారపడే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబంలో కూడా బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. తీరిక లభించని పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శించడంతో పాటు, విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానం, ధన స్థానాధిపతి బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. మాటకు విలువ పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఏలిన్నాటి శని కారణంగా వృత్తి, ఉద్యోగాలలో ఒకటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశిలో నాలుగు గ్రహాలు యుతి చెందడం, తృతీయ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు కూడా వెళ్లడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఏ ప్రయత్నమైనా విజయవంతంగా నెరవేరుతుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి.
Also read
- Palnadu: 100 గ్రాముల బిస్కెట్ 6 లక్షలకే.. లచ్చలు.. లచ్చలు ఇచ్చేశారు.. కట్ చేస్తే..
- బీచ్‌కు వెళ్తే అర్ధరాత్రి అలజడి.. కారు కింద తిష్ట వేసుకుని.. వామ్మో వీడియో చూస్తే..!
- దారుణం.. హోలీ రోజు ఫుల్‌గా తాగి కొట్టుకుని చనిపోయిన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్!
- మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించి ఒకడు.. వీడియో తీసి మరోకడు..స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి
- లవర్‌తో మాట్లాడుతూ దొరికిపోయింది.. ప్రశ్నించిన భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసింది!
- Andhra: ఏం బ్రాండ్ తాగావ్ అన్న.. బస్సు టైర్‌పై పడుకుని 15 కిలోమీటర్లు ప్రయాణం
- ఆమెను చేసుకుంటా.. నిన్ను ఉంచుకుంటా.. ప్రియుడి మోసానికి ప్రియురాలి ట్విస్ట్!
- Andhra Pradesh: పిల్లాడనే కనికరం లేకుండా పోయింది.. కుక్కల గొలుసుతో కట్టేశారు..!
- Weekly Horoscope: వారికి అన్ని ప్రయత్నాల్లోనూ విజయమే.. 12 రాశుల వారికి వారఫలాలు
- తాగుబోతుల వీరంగం.. ఒకడు భార్యను బస్సు కింద తోసేస్తే, మరోకడు రోడ్డుపై వాహనాలను ఆపేశాడు!