కర్నూలులో భగ్గుమన్న పాత పగలు.. టీడీపీ నేత దారుణ హత్య
కర్నూల్‌లో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. గుడికి వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.
కర్నూల్‌లో టీడీపీ నేత శుక్రవారం రాత్రి దారుణంగా హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. అదే కాలనీలోని గుడికి వెళ్లి భజన పూర్తి చేసుకొని వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. నిందితుడు రామాంజనేయులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడు. వీరి కుటుంబాల మధ్య పాతకక్ష్యలు ఉన్నాయి. సంజన్న గతంలో వైసీపీలో ఉండి.. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణం ఆధిపత్య పొరని ప్రాథమికంగా భావిస్తున్నారు
ఎప్పటినుంటో రామాంజనేయులు, సంజన్న కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సంజన్న కుమారుడు జయరాం ప్రస్తుతం కార్పొరేటర్‌గా YSRCP పార్టీలోనే ఉన్నాడు. మాజీ కార్పొరేటర్ సంజన్న ఎన్నికల ముందు టీడీపీ పార్టీలోకి చేరాడు.
Also Read
- Durgs : శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
- Crime News: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
- Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్మెంట్
- శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ