March 13, 2025
SGSTV NEWS
Astro TipsSpiritual

Holi 2025: హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి.. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి



దేశవ్యాప్తంగా హోలీ పండుగ సందడి మొదలైంది. శివయ్య కొలువైన కాశీలో మాసాన్ హోలీని జరుపుకున్నారు. ఇక హోలీకా దహనానికి, హోలీ పండగ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. అయితే హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాదు దానధర్మాలు కూడా చేస్తారు. హోలీ రోజున దానధర్మాలు చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ హోలీని రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో తెలుసుకుందాం.

హిందూ మతంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున ఎక్కడ చూసినా రంగులు కనిపిస్తాయి. హోలీ పండుగ శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తుంది. హోలీ రోజున ప్రజలు రంగులు పూసుకుని, ఒకరినొకరు కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు హోలిక దహనాన్ని జరుపుకుంటారు.

హోలీ పండుగ రోజున దానధర్మాలు చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం హోలీ రోజున దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయి. ఈ రోజున మీ రాశి ప్రకారం దానం చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో వ్యక్తులు తమ రాశి ప్రకారం హోలీ రోజున మీరు కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదం. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

హోలీ ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిధి మార్చి 13న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మార్చి 14న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో హోలికా దహనాన్ని మార్చి 13న నిర్వహిస్తారు. హోలీ పండగను మార్చి 14న జరుపుకుంటారు.



హోలీ రోజున ఏ రాశివారు ఏ దానాలు చేయాలంటే

👉   మేష రాశి వారు హోలీ రోజున గోధుమ, రాగి, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. దీని వలన వీరు ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధిస్తారు.

👉   వృషభ రాశి వారు హోలీ రోజున వెండి, బెల్లం, తెల్లని వస్త్రాలను దానం చేయాలి. దీని వలన ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

👉   మిథున రాశి వారు హోలీ రోజున ఆకుపచ్చ రంగు వస్తువులు, పుస్తకాలు, పెన్నులను దానం చేయాలి. ఇది వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

👉   కర్కాటక రాశి వారు ఈ రోజున పాలు, బియ్యం , తెల్లని పువ్వులు దానం చేయాలి. దీని వలన ఈ రాశులకు చెందిన వ్యక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

👉   సింహ రాశి వారు ఈ రోజున బంగారం, కుంకుమ, నారింజ పండ్లను దానం చేయాలి. దీని వలన వీరి గౌరవం పెరుగుతుంది.

👉   కన్య రాశి వారు ఈ రోజున తేనె, రాగి, ఆకుపచ్చని పండ్లను దానం చేయాలి. ఇది వీరికి జీవితంలో ఆనందం, శాంతిని ఇస్తుంది.

👉   తుల రాశి వారు ఈ రోజున వెండి, గులాబీ పువ్వులు, తెల్లని వస్త్రాలను దానం చేయాలి. ఇది తుల రాశి వారి కెరీర్‌లో విజయాన్ని తెస్తుంది.

👉   వృశ్చిక రాశి వారు ఈ రోజున రాగి, పెసలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇది వీరికి జీవితంలో విజయానికి మార్గాన్ని తెరుస్తుంది.

👉   ధనుస్సు రాశి వారు ఈ రోజున పసుపు రంగు దుస్తులు, పసుపు, ఉసిరి దానం చేయాలి. ఇలా చేయడం వలన జీవితంలో పురోగతి కలుగుతుంది.

👉   మకరరాశి వారు ఈ రోజున అన్న దానం, వస్త్ర దానం చేయాలి. ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది.

👉   కుంభ రాశి వారు ఈ రోజున రాగి, నీలం రంగు దుస్తులు, అన్నం దానం చేయాలి. ఇది వీరి జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు.

👉   మీన రాశి వారు ఈ రోజున తెల్లని వస్త్రాలు, ముత్యాలు, పాలు దానం చేయాలి. ఇది ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలను తెస్తుంది.

Also read

Related posts

Share via