పాపం మహిళ.! మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. ఆ మహిళ ప్రాణం మీదకొచ్చింది. భార్యభర్తలు ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఇక ఆ తర్వాత జరిగిన సీన్ తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి
మటన్ కర్రీ వండలేదని అక్కసుతో భార్యను కొట్టి చంపిన కసాయి భర్త సంఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. కర్రతో భార్యను కొట్టి చంపిన ఆ పాపిష్టి భర్త పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. సీరోల్ మండలం మాంజాతండాలో ఈ దారుణం జరిగింది. మాలోత్ బాలు అనే వ్యక్తి అతి కిరాతకంగా తన భార్య మాలోత్ కళావతిని కర్రతో కొట్టి చంపాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో ఈ ఘటన జరిగింది. మటన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
భార్యను మటన్ వండమంటే వండలేదని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త బాలు కర్రతో భార్యపై దాడిచేశాడు. తల, మెడపై బలమైన గాయాలు కావడంతో కళావతిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా, పరార్ అయిన నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025