March 12, 2025
SGSTV NEWS
National

Lok Sabha New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం



వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం


New Immigration Bill: భారత దేశంలో కొన్ని చట్టాలు స్వాతంత్ర్యం రాక ముందు రూపొందించినవే. ఇప్పటికీ వాటిని మోడిఫై చేయలేదు. అందులో కొన్ని నేటి అవసరాలకు సరిపడా కూడా ఉండటం లేదు. అలాంటి వాటిని గుర్తించిన కేంద్రం వాటిని మోడిఫై చేస్తున్నారు. మంగళవారం కూడా అలాంటి చట్టాన్ని లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లను తీసుకొచ్చింది. చట్టాల్లో ఉన్న లోపాలను అవకాశంగా మార్చుకొని దేశంలోకి వస్తున్న అక్రమార్కులను చెక్ పెట్టేలా దీన్ని క్రియేట్ చేసింది.



అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన ఈ బిల్లులో కీలకాంశాలు ప్రస్తావించింది. ఈ బిల్లును కేంద్రమంత్రి అమిత్‌షా లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ చట్టం అమలులోకి వస్తే అక్రమచొరబాటుదారులపై కఠిన వైఖరి అనుసరించనబోతున్నారు. వాళ్లను ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. అక్రమ వలసదారు అని తేలితే  ఆ వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ఐదు లక్షల జరిమానా కూడా వేస్తారు. వీటితోపాటు అక్రమంగా వీసాలు, పాస్‌పోర్టులు పొందితే కూడా చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఈ మేరకు అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారులు ఇచ్చారు.

ఇప్పుడు ప్రవేశ పెట్టిన బిల్ ప్రకారం జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా విదేశీయులకు వీసాలను భారత్  నిరాకరించవచ్చు. ఇండియాలోకి వచ్చే విదేశీయుల కదలికలను కూడా నియంత్రించ వచ్చు. అతిక్రమించిన వారిపై జరిమానా కూడా విధించవచ్చు.

Continues below advertisement
ఇప్పటి వరకు భారత్‌లో పాస్‌పోర్టు చట్టం(ఎంట్రీ ఇన్‌ టు ఇండియా) చట్టం, 1920; రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌,, 1939; ఫారినర్స్‌ యాక్ట్‌, 1946; వీటిని బ్రిటీష్‌వారు ఆమోదించిన చట్టాలు. తర్వాత 2000వ సంవత్సరంలో ది ఇమ్మిగ్రేషన్‌ (క్యారియర్స్‌ లయబిలిటీ)చట్టం, 2000 తీసుకొచ్చారు. ఈ నాలుగు చట్టాలను ఏకం చేసి ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్‌ ఫారినర్స్ బిల్లు, 2025, రూపొందించారు.
విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర విద్యా, వైద్య సంస్థల్లోకి విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తూ కొత్త చట్టంలో కీలక రూల్స్ తీసుకొచ్చారు. ‘జాతీయ భద్రతకు ముప్పు’ గా భావిస్తే వీసాలు తిరస్కరించే బాధ్యత ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఉంటుంది. విదేశీయులను బహిష్కరించడమో లేదా కొన్ని పరిమితులు విధించడం, మినహాయింపులు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది.

కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో మొత్తం 35 నిబంధనలతో ఆరు అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఇమ్మిగ్రేషన్ అధికారి పాత్ర, పనితీరును విశ్లేషిస్తుంది. వీసా, పాస్‌పోర్టు జారీకి అవసరమైన వివరాలు తెలియజేస్తుంది. విదేశీయుల నమోదుకు చర్యలు తీసుకుంటుంది.

ప్రస్తుతానికి వీటిని నిర్వహిస్తున్న బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు మరింత బలం ఇవ్వబోతోందీ బిల్లు. జాతీయ భద్రత పటిష్టం చేస్తూనే చట్టప్రకారం వచ్చే ప్రయాణికులకు సులభతరమై సేవలు అందించనుంది. యూనివర్శిటీస్‌, ఆసుపత్రులకు వచ్చే విదేశీయులపై కూడా నిఘా పెట్టనుంది. ప్రస్తుతానికి ఇలా వచ్చే విదేశీయులపై ఎలాంటి నియంత్రణ లేదు. ఇకపై వారిని కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు.

ఇప్పుడున్న చట్టాల ప్రకారం విదేశీయులు ఇండియాకు రావాలంటే వాళ్లు విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలి. భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఇలా నమోదు చేసుకోవాల్సింది. వైద్యం, ఉపాధి, విద్య లేదా పరిశోధన కోసం వచ్చే విదేశాయులు 180 రోజులకుపైగా భారత్‌లో ఉంటామని పేర్లు నమోదు చేసుకోవాలి. ఆలోపే వెళ్లిపోయే వాళ్లకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్లు తమ ఐడీని అధికారులకు చూపించాలి.

Also read

Related posts

Share via