కారులో కాలేజీ నుంచి ఇంటికి బయల్దేరిన ఇంజనీరింగ్ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తోటి విద్యార్ధులతో కలిసి రోడ్డుపై వేగంగా కారు నడిపి నిండు ప్రాణాన్ని బలిచ్చాడు. ప్రమాదంలో కారులోని మరో ఐదుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకివెళ్తే..
గండిపేట, మార్చి 11: సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తోటి స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇంజనీరింగ్ విద్యార్ధి అతివేగం కారణంగా దుర్మరణం చెందాడు. వాహనాన్ని వేగంగా నడపడంతో అది అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకివెళ్తే..
హైదరాబాద్ నగరంలోని గండిపేటలోని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మంగళవారం సాయంత్రం TS08BEG4929 నెంబర్ గల స్విఫ్ట్ కార్లో కళాశాల నుంచి ఇంటికి బయల్దేరారు. అయితే నియో పోలీస్ సమీపంలోని రాజపుష్ప కన్స్ట్రక్షన్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకర్ (18) అనే విద్యార్ధి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అదే వాహనంలోని హేమ సాయి (19), వివేక్ (19), సృజన (18), కార్తికేయ (18), హర్ష (19) అనే ఐదురుగు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో హర్ష సాయి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే నిండు ప్రాణాన్ని బలిగొన్నందని, ఎన్నిసార్లు హెచ్చరించినా యువత వేగంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనీ నార్సింగి పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధ్యాపకులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించాలని పోలీసులు కోరారు. కాగా తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025