Sri Viswavasu Nama Samvatsaram 2025 2026 Aaya Vyaya: తెలుగు సంవత్సరాలు 60.. ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాం. మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి మార్చి 30 నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరంలో మీ రాశి ప్రకారం ఆదాయం, వ్యయం ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి ( అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం )
ఆదాయం: 2 , వ్యయం:14 , రాజపూజ్యం:5 , అవమానం:7
వృషభ రాశి ( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు)
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 1 అవమానం : 3
మిథున రాశి (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు మొదటి 3 పాదాలు )
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 4 అవమానం : 3
కర్కాటక రాశి ( పునర్వసు ఆఖరి పాదం, పుష్యమి, ఆశ్లేష )
ఆదాయం : 8 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 7 అవమానం : 3
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదం )
ఆదాయం : 11 వ్యయం : 11 రాజ్యపూజ్యం:3 అవమానం : 6
కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త మొదటి రెండు పాదాలు)
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6
తులా రాశి ( చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ మొదటి 3 పాదాలు )
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం:2 అవమానం : 2
వృశ్చిక రాశి ( విశాఖ నాలుగో పాదం, అనూరాధ, జ్యేష్ట )
ఆదాయం : 2 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2
ధనస్సు రాశి ( మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ మొదటి పాదం )
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 1 అవమానం : 5
మకర రాశి ( ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట మొదటి 2 పాదాలు)
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5
కుంభ రాశి ( ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర మొదటి 3 పాదాలు)
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 7 అవమానం :5
మీన రాశి ( పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి )
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1
@ ఆదాయం అంటే మీ సంపాదన.. వ్యయం అంటే మీరు చేసే ఖర్చు.. రాజపూజ్యం అంటే మీరు పొందే గౌరవం, అవమానం అంటే మీకు ఆల్రెడీ తెలుసు
@ ఆదాయం సంఖ్య కన్నా వ్యయం సంఖ్య తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో కొంత దాచుతారు
@ ఆదాయం సంఖ్య కన్నా వ్యయం సంఖ్య ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు భారీగా పెడతారని అర్థం
@ ఆదాయం, వ్యయం రెండు నంబర్లు సమానంగా ఉంటే ఇలా సంపాదిస్తారు..అలా ఖర్చు చేస్తారని అర్థం. అంటే లాభం-నష్టం ఏమీ ఉండవు అలా సాగిపోతుంది అంతే..
@ రాజపూజ్యం సంఖ్య కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని గౌరవించేవారి సంఖ్య ఎక్కువ, తిట్టేవారి సంఖ్య తక్కువ ఉంటుంది
@ రాజపూజ్యం కన్నా అవమానం నంబర్ పెద్దగి ఉంటే…మిమ్మల్ని పొగిడే వారికన్నా తిట్టే వారే ఎక్కువ మంది ఉంటారని అర్థం
@ రాజపూజ్యం – అవమానం ఈ రెండూ సమానంగా ఉంటే….పొగిడేవారు, తిట్టేవారు సమానంగా ఉంటారని అర్థం
