ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణ శివారు రైతునగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. శివసాయి గ్రీన్ హోమ్స్ కాలనీలో టీడీపీ నేత కోదండ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక నౌమాన్ నగర్‌లో ఉన్న తమ కూతురు ఇంటికి కోదండ రెడ్డి దంపతులు వెళ్లి తిరిగి వచ్చే లోపల ఇంట్లోని నగదు బంగారం అపహరిచి పరార్ అయ్యారు.
దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 20 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును అపహరించారు.చోరీ విషయం తెలిసిన కోదండ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. రూరల్ పోలీసుల బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!