వివాహ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నవ వధువును మెట్టినింటికి సాగనంపుతున్న క్రమంలో కారు సృష్టించిన బీభత్సంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా పలువురికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంకు కారణమైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్ పల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్ పల్లి గ్రామంలో నవ్య, అశోక్ ల వివాహాన్ని ఘనంగా జరిపించారు. అప్పగింతల తంతు ముగిసిన తరువాత వధూవరులను సాగనంపే కార్యక్రమంలో భాగంగా భరాత్ (ఊరేగింపు) నిర్వహించారు. మేళతాళాల మధ్య నవ వధువులు కూర్చున్న కారు ముందు బంధువులు, కుటుంబ సభ్యులు సంతోషంగా డ్యాన్స్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఊరేగింపు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్ కాకుండా వేరే వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చుని గేర్ వేసి ఉన్న కారును స్టార్ట్ చేశాడు. దీంతో ఊరేగింపులో పాల్గొన్న వారిమీదుగా కారు దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 20 మంది వరకు గాయపడగా హుటాహుటిన జమ్మికుంట, హుజురాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఉమ (38) మృత్యువాత పడగా మృతదేహాన్ని హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు.
శంకరపట్నం పోలీసుకుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో..గ్రామం లో విషాదం అలుముకుంది. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంకు కారణమైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్సలెటర్ పై కాలు వేయడం తో దూసుకెళ్ళింది.. మొత్తానికి.. పెళ్లి వేడుకల్లో విషాదం నింపింది..
Also read
- BREAKING: అఘోరి అరెస్ట్.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు!
- ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే?
- TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా