March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఇదేం మోసం మావ.. ఇది ఇంకో రకం.. కొంప కొల్లేరు అయ్యింది..!



మోసం ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. ఎవరిని నమ్మితే ఎక్కడ ముంచుతారో అర్థం కావడం లేదు. కొత్త.. కొత్త ఐడియాలతో చెలరేగిపోతున్నారు సైబర్ క్రిమినల్స్. అమాయకులను ఈజీగా చీట్ చేస్తున్నారు. ఇప్పటికే సొసైటీలో రకరకాల మోసాలు చూశాం. ఇది ఇంకో రకం. ఫేమస్ స్టార్ల సినిమాలకు ప్రమోషన్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగిని నిండా ముంచేశారు.


మోసం ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. ఎవరిని నమ్మితే ఎక్కడ ముంచుతారో అర్థం కావడం లేదు. కొత్త.. కొత్త ఐడియాలతో చెలరేగిపోతున్నారు సైబర్ క్రిమినల్స్. అమాయకులను ఈజీగా చీట్ చేస్తున్నారు. ఇప్పటికే సొసైటీలో రకరకాల మోసాలు చూశాం. ఇది ఇంకో రకం. ఫేమస్ స్టార్ల సినిమాలకు ప్రమోషన్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగిని నిండా ముంచేశారు. అతడి నుంచి ఏకంగా రూ.1.34 కోట్లను కొల్లగొట్టారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు.


హైదరాబాద్ ఛత్రినాక పరిధిలోని అరుందతి కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఎంప్లాయి తన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు గోవా వెళ్లి వస్తుండేవాడు. గత సవత్సరం అక్టోబరులో గోవాకి వెళ్లిన సమయంలో బిగ్డాడీ క్యాసినోకు వెళ్ళారు. అక్కడ శ్రీలంకకు చెందిన ఉదయ్‌రాజ్, వివేక్‌లు కనెక్ట్ అయ్యారు. వారు తాము కొత్తగా రిలీజ్ అయ్యే టాలీవుడ్ సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తామంటూ నమ్మబలికారు. అదే నెలలో ఉదయ్‌రాజ్ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు వస్తే బాధితుడు వెళ్లి అన్ని వివరాలు తెలుసుకున్నాడు.

త్వరలో రిలీజ్ కానున్న చిత్రానికి ప్రమోషన్ చేసేందుకు ఛాన్స్ వచ్చిందని ఉదయ్‌రాజ్ నమ్మబలికాడు. ఓజీ మూవీ దర్శకుడు సుజిత్ ఫొటోలను చూపిస్తూ నమ్మించాడు. దీంతో బాధితుడికి నమ్మకం కుదిరింది. గతేడాది అక్టోబరు 12న ఉదయ్‌రాజ్, వివేక్‌.. ప్రైవేటు ఉద్యోగిని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు అమరన్ చిత్ర ప్రమోషన్‌కు రూ.20 లక్షలు ఇస్తే వారం రోజుల్లో రెట్టింపు ప్రాఫిట్స్ ఇస్తామంటూ నమ్మబలికారు. దీంతో ఇదంతా నిజమేనని నమ్మి ఇచ్చేశాడు ఇతడు. ఆపై రెండుసార్లు ఆ ఇద్దరి బ్యాంకు అకౌంట్స్ నుంచి అమరన్ సినిమాలో లాభాలు వచ్చాయంటూ రూ.25 లక్షలు ప్రైవేటు ఉద్యోగి ఖాతాలో వేశారు.


డబ్బులు జమ చేయడంతో బాధితుడికి బాగా నమ్మకం కుదిరింది. తరువాత, యూఐ, కంగువా, సీతాపయనం, పుష్ప-2, గేమ్ ఛేంజర్ చిత్రాల ప్రమోషన్ పెట్టుబడి పేరిట ఆన్‌లైన్‌లో రూ.76 లక్షలు, దశల వారీగా రూ.58 లక్షలు కేటుగాళ్లు తీసుకున్నారు. బాధితుడు తన ఇంటిని అమ్మి, నగలు తాకట్టు పెట్టి, మరికొంత అప్పు చేసి మొత్తం రూ.1.34 కోట్లు సమకుర్చాడు. ఆ తర్వాతే అసలు సినిమా చూపించారు. ఆపై వారి వద్ద నుంచి ఎలాంటి డబ్బు తిరిగి రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. మోసపోయినట్లు గ్రహించాడు. ఆ వెంటనే బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు


Also read

Related posts

Share via