March 15, 2025
SGSTV NEWS
Crime

Crime: ఎఫ్ఫైర్ గురించి నిలదీసినందుకు భార్యను కిరాతకంగా కొట్టి.. చివరికి ఏం చేశాడంటే?


విజయవాడ గుణదలలో దారుణం చోటుచేసుకుంది. శిరీష అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త వెంకట్రావును అక్రమసంబంధం గురించి నిలదీయడంతో అతడే చంపాడని శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. శిరీష విద్యాభారతి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.


Crime: వివాహేతర సంబంధం గురించి  నిలదీసినందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన విజయవాడ జిల్లా గుణదలలో చోటుచేసుకుంది. మల్లపు శిరీషకు అనే మహిళకు కొన్నేళ్ళ క్రితం  వెంకట్రావుతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే  నిన్న శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. భర్త అక్రమ సంబంధం గురించి నిలదీయడంతో అతడే శిరీషను చంపాడని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.  శిరీష చావుకు భర్త వెంకట్రావే కారణమని ఆందోళనకు దిగారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. శిరీష విద్యాభారతి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది

ఇటీవలే మలక్ పేట్ లో మరో శిరీష
ఇది ఇలా ఉంటే.. ఇటీవలే మలక్ పేట్ లో మరో శిరీష భర్త, ఆడపడుచు చేతిలో దారుణ హత్యకు గురైంది. తన వివాహేతర సంబంధాల గురించి తెలిసిన శిరీష ఎప్పటికైనా ప్రమాదమని భావించిన ఆడపడుచు శిరీషకు మత్తు మందు ఇచ్చి చంపింది. అక్కకు తోడుగా తమ్ముడు కూడా చేరి కట్టుకున్న భార్యను హతమొందించారు.

అయితే ఆడపడుచు సరిత భర్త విదేశాల్లో ఉండటంతో సరిత అక్రమ సంబంధాలు పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం శిరీషకు కూడా  తెలియడంతో.. ఓ సారి సరితో గొడవ జరిగిన సమయంలో నీ అక్రమ సంబంధాల చరిత్ర గురించి అందరికీ చెప్తాను అని కోప్పడింది. దీంతో శిరీష ఉండడం తనకు ఎప్పటికైనా ప్రమాదమని భావించిన సరిత..  శిరీషను అంతమొందించాలని ఫిక్స్ అయింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు . శిరీష చనిపోయాక అక్క, తమ్ముడు ఇద్దరూ  కలిసి ఆమెకు గుండెపోటు వచ్చిందని నాటకం ఆడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అయితే శిరీష మేనమామ మధుకర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు వినయ్‌, సరితలను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

Also read

Related posts

Share via