శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో,అనురాధ క్యాటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. కొద్దిరోజులుగా భార్య పైన అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ తరచూ గొడవలు పడేవాడని, గత నెల 26వ తేదీన ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో ఆమెను భర్త తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె చనిపోయింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ దారుణం. ఏదులాబాద్ గ్రామంలో నివాసముంటున్న శ్రీనివాస్, అతని భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రాత్రి మళ్లీ గొడవ జరగగా.. కోపంలో భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహా కోల్పోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. స్థానికులను అడగగా.. భార్యాభర్తల తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





