March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Srisailam Temple : శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్లు.. ఇద్దరు అరెస్ట్


ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు.  పాత సర్వదర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు వేల రూపాయలకు అమ్మిన ఇద్దరు కేటుగాళ్లపై  ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) లో నకిలి దర్శనం టికెట్ల కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు.  పాత సర్వదర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు వేల రూపాయలకు అమ్మిన ఇద్దరు కేటుగాళ్లపై  ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నకిలి టికెట్ల అమ్మకాలు, భక్తులు కొనుగోలుపై పోలీసులు ఆరా తీశారు.  ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు.

ఇంటర్ నెట్లో నకిలీ టికెట్లు
ఈజీ మనీ (Easy Money) కి అలవాటు పడిన నిందితులు  నకిలీ టికెట్లను ఇంటర్ నెట్లో తయారు చేసి భక్తులకు వేల రూపాయల్లో అమ్ముతూ దర్శనానికి పంపిస్తుండగా తనిఖీల్లో నకిలీ టికెట్ల బాగోతం బట్టబయలు అయింది. ఫిబ్రవరి 14వ తేదీన స్వామి వారి దర్శనానికి కొంతమంది భక్తులు వచ్చారు. అయితే వారికి దర్శనం టికెట్లు ఇస్తామని చెప్పిన ఇద్దరు వ్యక్తులు  వేల రూపాయలు కాజేశారు.  వారికి నకిలీ టికెట్లు ఇచ్చి లోపలికి పంపించారు

స్కానింగ్ సెంటర్ వద్ద బట్టబయలు
వాటిని తీసుకుని సదరు భక్తులు క్యూలైన్‌లో వెళ్లారు. తమ వంతు వచ్చే సరికే  స్కానింగ్ సెంటర్ వద్ద టికెట్లు ఇచ్చి లోపలికి వెళ్లి ప్రయత్నం చేయగా..  టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో వారిని సిబ్బంది అడ్డుకున్నారు.. ఆ టికెట్స్ ను చెక్ చేయగా.. అవి ఫేక్ టికెట్స్‌గా అని తేలింది. దీంతో  ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా, దర్యాప్తు చేపట్టిన ఒకటో పట్టణ పోలీసులు నిందితులను గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

అయితే టికెట్లపై  దేవస్థానం సీల్ (స్టాంపు)ను, సంతకం ఫోర్జరీ చేయడం ఉద్యోగులలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఆలయ అధికారులు భాధ్యులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.

Also read

Related posts

Share via