SGSTV NEWS
Andhra Pradesh

Raghu Rama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కేసులో బిగ్ ట్విస్ట్…  సునీల్‌నాయక్‌కు నోటీసులు !


టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.  ఐపీఎస్‌ అధికారి సునీల్‌నాయక్‌ను విచారణకు పిలుస్తూ పోలీసులు  నోటీసులు పంపారు.  ఫ్యాక్స్, వాట్సప్‌ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు పంపారు

టీడీపీ (TDP) ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) పై హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.  ఐపీఎస్‌ అధికారి సునీల్‌నాయక్‌ను విచారణకు పిలుస్తూ పోలీసులు  నోటీసులు పంపారు.  ఫ్యాక్స్, వాట్సప్‌ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు పంపారు.  హైదరాబాద్ లో  రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చినప్పుడు  సునీల్ కూడా వచ్చారని అధికారులు గుర్తించారు. దీంతో ఇందులో ఆయన పాత్రపై విచారించేందుకు నోటీసులు పంపారు.  సునీల్‌నాయక్‌ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు.

అగ్నిమాపక విభాగంలో డీఐజీగా
బిహార్ (Bihar) క్యాడర్ కు చెందిన సునీల్‌నాయక్‌ గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ డీఐజీగా పనిచేశారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే  బీహార్ కు వెళ్లిపోయారు.  ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని ఆ విభాగం ఉన్నతాధికారులకూ సమాచారం ఇచ్చారు. గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన  రఘురామ కృష్ణంరాజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు.

Also read

Related posts

Share this