ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుడు సంఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాటరీల నాణ్యత, ఛార్జింగ్ పద్ధతులు, తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన అవసరం. ఈ ప్రమాదం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తలెత్తే ప్రమాదం ఉంది.
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ఆసక్తి చూపుతున్నారు. భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల జేబులకు చిల్లులు పడుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ, కొన్ని కంపెనీలకు చెందిన వాహనాల్లో బ్యాటరీలు పేలిపోవడం, ఛార్జింగ్ పెట్టిన సమయాల్లో మంటలు రావడం, ఎండకు వాహనాలు పార్క్‌చేస్తే బ్యాటరీల్లో మంటలు చెలరేగి, వాహనాలు పూర్తిగా కాలిపోతున్న సంఘటనలు తరుచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఇలాంటి ఓ ఘటనే జరిగింది. నడిరోడ్డుపైనే ఓ ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు చెలరేగి.. పూర్తిగా కాలి బుడిద అయ్యింది.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బ్యాటరీలు ఎక్కడ బాంబులా పేలిపోతాయో అని ఆందోళ చెందారు. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు సమీపంలోని నిక్కపూడి గ్రామానికి చెందిన సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి తన ఆరా బ్యాటరీ చార్జింగ్ బండి వేసుకుని ఆదివారం మధ్యాహ్నం పని మీద రావులపాలెం వచ్చారు. రావులపాలెంలోని కెనాల్ రోడ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలోకి వచ్చేసరికి పెద్దిరెడ్డి తన బ్యాటరీ చార్జింగ్ బండిని ఒక వ్యాపార దుకాణం వద్ద ఆపి బండి దిగారు. ఈ లోపు ఒక్కసారిగా బండిలో నుంచి పొగతో కూడిన మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా షాక్ కు గురైన పెద్దిరెడ్డి ఆందోళనతో దూరంగా పరుగులు తీశాడు.
అక్కడే ఉన్న సంచుల వ్యాపారులు, ప్రజలు ఎక్కడ బ్యాటరీలు పేలు పోతాయో అని భయపడి వారు కూడా దూరంగా పరుగులు తీశారు. క్షణాల వ్యవధిలో జరిగిపోయిన ఈ సంఘటనతో పెద్దిరెడ్డి అయోమయానికి గురవడంతో స్థానికులు అతని కూర్చోబెట్టి సపర్యలు చేసి ధైర్యాన్ని ఇచ్చారు. సుమారు గంటపాటు ఆ మోటార్ సైకిల్ తగలపడి పోయినంతసేపు అటుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. రావులపాలెంలో చోటుచేసుకున్న ఈ సంఘటనతో బ్యాటరీ బళ్ళు వాడుపుతున్న వినియోగదారులంతా అమ్మ బాబోయ్ అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటేనే భయంగా ఉందని అంటున్నారు
Also read
- నేటి జాతకములు…14 మే, 2025
- Surya Transit: ఈ నెల 15 రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 4 రాశులవారిపై ప్రతికూల ప్రభావం.. అనుగ్రహం కోసం ఏమి చేయాలంటే..
- Weekly Worship Guide: వారంలో 7 రోజులు.. ఏ రోజు ఏ దేవుడిని పూజించడం మంచిదో తెలుసా..
- Lord Shani: శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. శనీశ్వర అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..
- ‘ఒక్కసారి రూమ్‌కు రా’.. నమ్మి వచ్చిన స్నేహితురాలిని తాగించి రేప్!