March 15, 2025
SGSTV NEWS
Astrology

Weekly Horoscope: ఎన్నడూ లేనంత మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు



వార ఫలాలు (మార్చి 2-8, 2025): మేష రాశి వారికి ఈ వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం కన్నా వ్యయం బాగా తక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారి ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. చిన్నా చితకా ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మిథున రాశి వారమంతా దాదాపు శుభ యోగాలతో సాగిపోతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశావారికి ఈ వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం కన్నా వ్యయం బాగా తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజ యోగాలు అనుభవిస్తారు. ఈ రాశివారి మాట చెల్లుబాటు కావడంతో పాటు, వీరి పనితీరు కూడా అధికారులకు బాగా నచ్చుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందడం వల్ల  ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ధన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి.


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. చిన్నా చితకా ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మొత్తానికి ఆర్థికంగా వారమంతా సానుకూలంగానే సాగిపోతుంది. ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపా రాలు లాభాల పరంగా కొద్దిగా పురోగమిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. పెళ్లి, ఉద్యోగాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి, వ్యయ ప్రయాసలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వారమంతా దాదాపు శుభ యోగాలతో సాగిపోతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా వృద్ది చెందుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత కష్టనష్టాల నుంచి బయట పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సానుకూల ఫలితానిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు. ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిగా అనవసర ఖర్చులు పెరగడం, అనవసర పరిచయాలు ఏర్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది కాలం పాటు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలున్నా అధిగమిస్తారు. అధికారులు ప్రతి విషయంలోనూ మీతో ఏకీభవిస్తారు. ప్రతి ముఖ్యమైన వ్యవహారంలోనూ ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకపోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు  ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. పిల్లలకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. రుణ సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలకు బంధువుల్ని దూరంగా ఉంచడం మంచిది.  కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.


కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన వల్ల వారం రోజుల జీవితం విలాసవంతంగా, సుఖ సంతో షాలతో సాగిపోతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరగడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనవసర ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.



తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడితో సహా శుభ గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారమంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహ కారాలు లభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

పంచమ, సప్తమాధిపతులైన గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. అర్ధాష్టమ శని ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో శ్రమానంతర ఫలితం ఉంటుంది. నిరు ద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పెండింగ్ లేకుండా పూర్త వుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు, ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మీద కాస్తంత ఎక్కువగానే ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్నశుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ తేలికగా  పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం కొద్దిగానైనా పెరగడం తప్ప తగ్గడం ఉండదు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. ఎటువంటి ఉద్యోగ ప్రయత్నమైనా సఫలమవుతుంది. సమాజంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వారమంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ఒత్తిడి తగ్గుతుంది. కొద్దిగా ఆలస్యంగానే అయినా ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. తండ్రి నుంచి నుంచి అన్ని రకాల సహాయ సహకారాలందుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. రుణ సమస్యలు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృథా ఖర్చులను ఎంత తగ్గించు కుంటే అంత మంచిది. తండ్రి వైపు నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల వైద్య ఖర్చులు తప్పక పోవచ్చు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

తాజా వార్తలు చదవండి

Related posts

Share via