శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దొంగలు పడ్డారు.. నలుగురు నిందితుల అరెస్ట్.. ఏం జరిగిందంటే..
అయితే పోలీసుల టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితులు మొహమ్మద్ ఖాదర్ ఖాన్, ఆదిలా శ్రీకాంత్, కేతావత్ భాషా, అబ్దుల్ వహీద్, మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ కుర్షిద్ హుస్సేన్, మహిద్ అలీ గా గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ ఖాదర్ ఖాన్, శ్రీకాంత్ కేతావత్ బాషా అబ్దుల్ వహీద్ లు కలిసి పవర్ కంట్రోల్ కాపర్ కేబుల్ ను..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పవర్ కంట్రోల్ కాపర్ కేబుల్ దొంగలించి విక్రయిస్తున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షల నగదు ఐదు సెల్ ఫోన్స్, ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. కేసు వివరాలను శంషాబాద్ డిసిపి రాజేష్ వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ట్యూమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పవర్ కంట్రోల్ కాపర్ కేబుల్ దొంగలించబడింది.. అనే ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే పోలీసుల టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితులు మొహమ్మద్ ఖాదర్ ఖాన్, ఆదిలా శ్రీకాంత్, కేతావత్ భాషా, అబ్దుల్ వహీద్, మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ కుర్షిద్ హుస్సేన్, మహిద్ అలీ గా గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ ఖాదర్ ఖాన్, శ్రీకాంత్ కేతావత్ బాషా అబ్దుల్ వహీద్ లు కలిసి పవర్ కంట్రోల్ కాపర్ కేబుల్ ను దొంగలించి బొలెరో వాహనంలో దానిని తరలించారు. మమ్మద్ హుస్సేన్ మహమ్మద్ కుర్షిద్ హుస్సేన్ మహీద్ అలి అనే వ్యక్తులకు విక్రయిస్తున్నారు.
అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. దీంతో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద 20 లక్షల నగదును ఐదు సెల్ ఫోన్ లను బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పవర్ కంట్రోల్ కాపర్ కేబుల్ ను కొనుగోలు చేసిన మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ ఖుర్షద్ హుసేన్ మహిద్ అలి లు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్క్రీమ్తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా