కోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లికి చెందిన మోత్కూరి సంజయ్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోత్కూరి వెంకటేశం-లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు సంజయ్ కల్లూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివాడు. గతేడాది జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలయ్యాడు.
అప్పటినుంచి మనోవేదనకు గురవుతున్నాడు. అయితే, ఈసారి కూడా ఫెయిలవుతానేమోనని భయపడ్డాడు. బుధవారం శివరాత్రి కావడంతో తల్లిదండ్రులు గుడికి బయలుదేరారు. వారికి తాను తర్వాత వస్తానని చెప్పి, ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also read
- శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రహస్య కథ తెలుసా?
- మధ్యాహ్నం పూజ చేయొచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.. పూజకు అత్యంత శుభమైన సమయం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
- కార్మికవర్గంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం….కంటిపోతు రమణ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.





