ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా పుణేలో పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఓ మహిళపై అఘాయిత్యం చేయడం సంచలనంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే స్వర్‌గేట్ బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.
బస్టాండ్ పార్కింగ్‌లో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ (26) పై అత్యాచారం జరగడం మహారాష్ట్రలోని పుణేలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సతారా జిల్లాలోని ఫల్తానాకు చెందిన ఓ మహిళ ఇళ్లలో పని చేస్తుంటుంది. దానిలో భాగంగా తెల్లవారుజామున బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. అయితే.. ఓ దుర్మార్గుడు ఆమె దగ్గరకు వెళ్లి మాయ మాటలతో నమ్మించి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు ఇక్కడ లేదని.. పక్కన పార్క్ చేశారంటూ నమ్మించాడు.. అక్కా అని పిలిచి ఆమెను నమ్మ బలికి.. అనంతరం తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ చీకటిగా ఉండటంతో ఆమె వెనకడుగు వేసినప్పటికీ.. బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని, అందుకే లైట్లు ఆర్పేశారంటూ నమ్మించాడు. దాంతో.. ఆమె బస్సు ఎక్కగానే లోపలికి వెళ్లి తలుపు వేసి.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత కామాంధుడు పరారీ కాగా.. మహిళ మాత్రం మరో బస్సు ఎక్కి.. జరిగిన దారుణం గురించి స్నేహితురాలికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పుణెలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పార్కు చేసిన బస్సులో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో గుట్టురట్టు అయింది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా తేల్చారు. అతడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించి నిందితుడిని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఇక.. నిత్యం రద్దీగా ఉండే స్వర్‌గేట్ బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డాయి. దాంతో.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘటనపై రియాక్ట్ అయ్యారు. నేరాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also read
- BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!
- AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..
- AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
- Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు!
- Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!