అల్లు అర్జున్ కు అత్యంత సన్నిహితుడు, నిర్మాత కేదర్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబాయ్ లో ఓ పార్టీలో పాల్గొన్న ఆయన.. అక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. అదే పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఉన్నారన్న వార్తలు సంచలనంగా మారాయి.
టాలీవుడ్ నిర్మాత కేదార్ డెత్ మిస్టరీ ఏంటనే అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. దుబాయిలో అనుమానాస్పద స్థితిలో ఈ నెల 25న కేదార్ మృతి చెందారు. ఇటీవల దుబాయిలో ఓ సినిమా ఫైనాన్షియర్ కొడుకు పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లారు. అక్కడే పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో డ్రగ్స్, మద్యం సేవించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ మధ్యలోనే కేదార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రోహిత్ రెడ్డి అరెస్టయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని రోహిత్ రెడ్డి వీడియో విడుదల చేశారు. కానీ తాను దుబాయి వెళ్లలేదని వీడియోలో ఎక్కడా రోహిత్ రెడ్డి చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గంగం గణేశా, రాజుయాదవ్ తదితర సినిమాలను కేదార్ నిర్మించారు. విజయ్ దేవరకొండతో సినిమా కోసం సుకుమార్‌కు కేదార్ అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ కోరిక నెరవేరకుండానే కేదర్ కన్నుమూశారు. కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గం గణేశా అనే సినిమా ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అల్లు అర్జున్, బన్నీ వాసు, విజయ్ దేవరకొండలకు ఈయన అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. గతంలో ముత్తయ్య అనే సినిమాకి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
విచారణ జరిపిస్తాం: రేవంత్ రెడ్డి
కేదార్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేదార్ కేటీఆర్ పార్టనర్ అంటూ చెప్పారు రేవంత్ రెడ్డి. కేదార్‌ది అనుమానాస్పద మృతి అని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో ఉన్న వారు వరుసగా చనిపోతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేదార్ మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు కోరితే కేదార్ మృతిపై విచారణ జరిపిస్తామన్నారు.
కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గం గణేశా అనే సినిమా ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అల్లు అర్జున్, బన్నీ వాసు, విజయ్ దేవరకొండలకు ఈయన అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. గతంలో ముత్తయ్య అనే సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
Also read
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి
- Garuda Puranam: మరణానంతర జీవితం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!
- AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..