శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి స్వామి వారిపై ద్యాస పెట్టకుండా ఇలా తప్పుడు పని కోసం ప్రయత్నించడంతో చావు దెబ్బలు తినకతప్పలేదు. భక్తురాలు ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు లేకుండా యువకుడు తిరుగు ప్రయాణం అయ్యాడు. లేదంటే పోలీసుల మర్యాద పొందాల్సి వచ్చేది.
తిరుమలలో ఒక యువకుడి యవ్వారం దేహశుద్ధికి కారణం అయ్యింది. ఒక భక్తురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేసిన యువకుడు చైన్ స్నాచర్ అనుకున్నారు. భక్తురాలు కేకలు వేయడంతో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడని తోటి భక్తులు పట్టుకున్నారు. ఘటన స్థలంలోనే స్థానికులతో కలిసి చితకబాదారు. అనంతరం చైన్ స్నాచర్గా భావించి విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. విజిలెన్స్ అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది.
పిలిగ్రీమ్ ఎమినిటీస్ సెంటర్-2 లో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో యాత్రికుల వసతి సముదాయం మాధవ నిలయంలో పడుకున్న భక్తురాలు మెడపై చెయ్యి వేశాడు ఓ యువకుడు. యువకుడి నిర్వాకంపై ఆరా తీసిన విజిలెన్స్ సిబ్బంది యువకుడు చైన్ స్నాచర్ కాదని గుర్తించారు. భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. భక్తురాలు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో యువకుడి కౌన్సిలింగ్ ఇచ్చిన విజిలెన్స్ సిబ్బంది వదిలి పెట్టారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి స్వామి వారిపై ద్యాస పెట్టకుండా ఇలా తప్పుడు పని కోసం ప్రయత్నించడంతో చావు దెబ్బలు తినకతప్పలేదు. భక్తురాలు ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు లేకుండా యువకుడు తిరుగు ప్రయాణం అయ్యాడు. లేదంటే పోలీసుల మర్యాద పొందాల్సి వచ్చేది
Also Read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!