ఫిబ్రవరి 23వ తేదీన రాత్రి తల్లి గీత, శివం అనే 8 నెలల బాలుడుతో కలిసి నిద్రపోయింది. తెల్లారి లేచి చూసేసరికి పక్కనే ఉన్న బాలుడు కనిపించకుండాపోయాడు. దీంతో పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం వెతికారు ఆ దంపతులు. దీంతో చివరికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది గీత.
పుట్‌పాత్‌పై తల్లి ప్రక్కన రాత్రి సమయంలో నిద్రిస్తున్న పసిబాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం చుట్టుప్రక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ తల్లి రోదిస్తూ సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోజుల వ్యవధిలోనే కేసును చేధించారు. ఆ 8 నెలల బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు హైదరాబాద్ పోలీసులు.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ శివాలయం రోడ్డులో కలివల గీత రాధేయ భార్యాభర్తలు స్క్రాప్ దందా చేసుకుంటున్నారు. రోడ్ల వెంబడి చెత్తను సేకరించి అమ్ముకుని తమ ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన రాత్రి తల్లి గీత, శివం అనే 8 నెలల బాలుడుతో కలిసి నిద్రపోయింది. తెల్లారి లేచి చూసేసరికి పక్కనే ఉన్న బాలుడు కనిపించకుండాపోయాడు. దీంతో పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం వెతికారు ఆ దంపతులు. దీంతో చివరికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది గీత. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు పోలీసులు. తల్లి దగ్గర నిద్రిస్తున్న బాలుడిని పక్కా ఫ్లాన్ ప్రకారమే ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నిందితులు బాలుడి కిడ్నాప్ చేసేందుకు ముందే పాల డబ్బా కొన్నట్లుగా గుర్తించారు. ఆ కోణంలో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బీహార్ రాష్ట్రానికి చెందిన సత్యనారాయణ, శోభాదేవి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
సత్యనారాయణ తన సహచరుడు సన్నీకుమార్ పాండేతో కలసి ప్లాన్ ప్రకారం పేద కుటుంబానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని భావించారు. దీంతో రోడ్డు వెంబడి నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కిడ్నాపర్స్ నుండి బాలుడిని క్షేమంగా రక్షించిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులు సత్యనారాయణ, సన్నీకుమార్ పాండేను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన్నట్లు బాలానగర్ డిసిపి వెల్లడించారు. కేసును చేధించిన సనత్ నగర్ పోలీసులను డిసిపి అభినందించారు
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా