కొన్ని గంటల్లో కొడుకు పెళ్లి చూసి మురిసిపోవాల్సిన తండ్రి గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది. సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్‌కు ఓ యువతితో ఫిబ్రవరి23న ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోపే 3గంటలకు సత్యనారాయణ గుండెపోటుతో కుప్పకూలాడు
పెళ్లి అనగానే ఇళ్లంతా సందడి సందడిగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు, చిన్న పిల్లలతో హాడావిడి హడావిడిగా ఉంటుంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటారు. కానీ అంతలోనే ఊహించని విషాదం జరిగితే.. అయ్యో పాపం అంటూ కన్నీరు పెట్టుకుంటాం.
తాజాగా అలాంటి హృదయవిదారక ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. తెల్లారితే కొడుకు పెళ్లి.. ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు. కానీ అంతలోనే పెళ్లి కొడుకు తండ్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. దీంతో మంగళవాయిద్యాలతో కలకలలాడాల్సిన ఇళ్లు.. కుటుంబ పెద్ద మృతితో శోకసంద్రలో మునిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తండ్రి పెళ్లి చూడకుండానే
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఈ ఘటన జరిగింది. రామక్కపేట గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి. అతడు తన పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భావన అనే అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది
ఫిబ్రవరి 23న ఉదయం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ గౌడ్ తుదిశ్వాస విడిచాడు. గుండెపోటుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లివారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయ్యో ఎంత పనిజరిగిందే అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కొడుకు పెళ్లి చూడకుండా ఆ తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి
ఇటీవల మరో ఘటన
ఇటీవల ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లికి చెందిన కుడిక్యాల బాలచంద్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 21న బాలచంద్రం పెద్ద కూతురు మహాలక్ష్మి పెళ్లి జరగనుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి తంతు కూడా ప్రారంభం అయింది. ఇక తాళికట్టే కొద్ది సమయంలో బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతరం హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




