SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: నాగ దోషం ఉందని ఇంటికి వెళ్లి ఆమెతో ఆ పని.. విషయం భర్తకు చెప్పడంతో..

 

విశాఖ కాపులుప్పాడలో కలకలం సృష్టించిన సగం కాలిన మృతదేహం మిస్టరీని చేదించారు పోలీసులు. అనుమానించినట్టుగానే పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు అప్పన్న హత్యకు గురైనట్టు నిర్ధారించారు. అతడిని దారుణంగా హత్య చేసి ఆపై.. పెట్రోల్ పోసి నిప్పంటించారు నిందితులు. ఈ కేసులో దంపతులను అరెస్టు చేశారు పోలీసులు.



పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్నదొర ఊరూరా తిరుగుతూ పూజలు చేస్తుంటాడు. ఈనెల తొమ్మిదో తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చిన అప్పన్నదొర… తిరికి ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన అప్పన్న కుమారుడు దుర్గాప్రసాద్‌ మరుసటి రోజు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం కాపులుప్పాడ సమీపంలోని ఒక లేఅవుట్‌లో శవాన్ని కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ పూసలతో పాటు లభించిన వస్తువులను బట్టి అది తన తండ్రిదేనని దుర్గాప్రసాద్‌ గుర్తించాడు. మృతదేహాన్ని అప్పన్న కొడుకు దుర్గాప్రసాద్ గుర్తుపట్టడంతో.. పోలీసుల ఆ కోణంలో దర్యాప్తుల ప్రారంభించారు. కూపి లాగితే చిన్నారావు అనే వ్యక్తి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. హత్య చేసి పడేసి ఆ తర్వాత మరుసటి రోజు భార్యతో కలిసి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు గుర్తించారు.

ఎందుకు అంత దారుణంగా హతమార్చారు..

అప్పనను ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చిందంటే… విచారణ చేసిన పోలీసులకు కీలక విషయాలు ఏర్పడ్డాయి. నేరేళ్లవలస ప్రాంతానికి చెందిన చిన్నారావు దంపతులు నెల క్రితం ఆనందపురం మండలం ఎల్‌.వి.పాలెంలో అద్దెకు దిగారు. వారికి ఇంటి సమీపంలో ఉండే టీ దుకాణం యజమాని తిరుపతమ్మతో పరిచయం ఏర్పడింది. ఆ టీ దుకాణంకు ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వెళుతుండేవాడు. సమస్యల నుంచి ఉపశమనం కోసం పూజలు చేస్తుంటాడని చిన్నారావు భార్య మౌనిక తెలుసుకుంది.

నాగ దోషం ఉందని ఇంటికి వెళ్లి..ఆమెతో..

తనకు సమస్యలు ఉన్నట్టు చెప్పడంతో.. మీకు నాగ దోషం ఉందని.. పూజలు చేస్తానని చిన్నారావు ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బలవంతంగా లోబరుచుకున్నాడు అప్పన్న. ఆ విషయం ఎవరితోనైనా చెబితే కుటుంబాన్ని తన శక్తితో నాశనం చేస్తానని బెదిరించాడు అప్పన్న. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలిపింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన చిన్నారావు.. అప్పన్నను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అందుకోసం ఒక బటన్‌ నైఫ్‌ను రెడీ చేసుకున్నారు.

ఆ ప్లాన్ ప్రకారం..

ప్లాన్ లో భాగంగా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని పూజ చేయాలని అప్పనకు కాల్ చేశాడు చిన్నారావు. అందుకు 7 వేలు ఇస్తానని అప్పన్నకు చెప్పాడు. దీంతో ఈ నెల 9న అప్పన్న ఆనందపురం వచ్చాడు. తన తల్లి ఉప్పాడలో ఉంటుందని.. అక్కడకు వెళ్దామని బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు చిన్నారావు. బోయపాలెం మీదుగా కాపులుప్పాడ నుంచి చేపలుప్పాడ వెళ్లే గ్రావెల్‌ రహదారిలోకి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో గంభీరం గెడ్డ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్‌ లేఅవుట్‌లోని షెడ్డు వద్దకు తీసుకువెళ్లి అప్పన్నను చిన్నారావు కత్తితో పొడిచి హత్య చేసాడని తెలిపారు పద్మనాభం సిఐ వాసు నాయుడు.

హత్య చేసి.. వెళ్ళిపోయి.. మళ్ళీ వచ్చి భార్యతో కలిసి పెట్రోల్ పోసి..

ఈ నేపథ్యంలో అప్పన్న, చిన్నారావు మధ్య జరిగిన పెనుగులాటలో చిన్నారావు వేలికి గాయమైంది. అప్పన్నను హతమార్చిన తర్వాత చిన్నారావు కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున పెట్రోల్‌ తీసుకుని భార్యతో కలిసి అప్పన్న మృతదేహం ఉన్న లేఅవుట్‌ వద్దకు వెళ్లాడు. మృతదేహంపై పెట్రోల్‌, తిన్నర్ పోసి నిప్పంటించారు. అక్కడ నుంచి జారుకున్నారు. పోలీసులు ఇద్దరని అదుపులోకి తీసుకున్న విచారించేసరికి అసలు విషయాన్ని ఒప్పుకున్నారని అన్నారు సిఐ వాసు నాయుడు.

నిందితుల నుంచి నైఫ్‌, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్స్‌ ఫ్యాంటు, అప్పన్న ఫోన్‌ పౌచ్‌, లైటర్‌ను స్వాధీనం చేసుకున్నరు పోలీసులు. నిందితులను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు

Also read

Related posts