తెలంగాణ లో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు లో నిందితులుగా ఉన్న ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములకు కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Phone tapping case : తెలంగాణ లో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫోన్ ట్యాపింగ్ కేసు లో నిందితులుగా ఉన్న ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వీరికి కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురికి వేర్వేరుగా 20వేల పూచికత్తు, రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిన్న హైకోర్టు ఇచ్చిన మద్యంతర స్టే ఉత్తర్వులను నాంపల్లి కోర్టుకు నిందితుల తరపు న్యాయవాది లక్ష్మణ్ సమర్పించారు. దీంతో వారికి కోర్టు బెయిల్ మంజూరైంది.
కాగా ఈ కేసులో దర్యాప్తు పై మార్చి 3 వరకు హైకోర్టు స్టే విధిచింది. కాగా మాజీ మంత్రి టి.హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో హరీష్ రావు వద్ధ పనిచేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఓ రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేసి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ఏ1గా మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు,ఏ2గా రాధాకిషన్ రావును పోలీసులు చేర్చారు. కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం జరిగిన విచారణలో జస్టీస్ లక్ష్మణ్ పీపీ అభ్యర్థన మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!