February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఎరక్కపోయి ఇరుక్కున్నాడు.. విలవిలలాడిన నాలుగేళ్ల బాలుడు.. చివరకి..!

నాలుగేళ్ల పిల్లాడు.. కావాలని వెళ్లాడో.. తెలియకుండా వెళ్లాడో తెలియదు. మొత్తానికి లిఫ్ట్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయాడు. అంతే.. అక్కడ ఉన్న వారికి ముచ్చెమటలు పట్టాయి. లోపల ఉన్న పిల్లాడికి ఏమౌతుందో తెలియదు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో DRF వెంటనే రంగంలోకి దిగింది. ఈ ఘటన హైదరాబాద్ మహా నగరంలో చోటు చేసుకుంది.

నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో నాలుగేళ్ల బాలుడు చిక్కుకున్నాడు. లిప్టులో నుంచి బాలుడు కేకలు విన్న ఇరుగు పొరుగు వచ్చే సరికి బాలుడు విలవిలలాడిపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.. అక్కడికి చేరుకున్న పోలీసులు గంటల తరబడి చెమటోడ్చి DRF బృందం సహయంతో బాలుడిని బయటకు తీశారు. లిఫ్ట్ గ్రిల్ విరగొట్టి, గోడను పగలగొట్టి బాలుడికి ఆక్సిజన్ ఇస్తూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడికి DRF సిబ్బంది క్షేమంగా కాపాడింది. అనంతరం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ గంటల తరబడి సమయం పట్టింది. ఎట్టకేలకు DRF టీం బాలుడిని సురక్షితంగా బయటకు తీసింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు

Also

Related posts

Share via